దర్శిలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

దర్శి, మహానాడు : టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం దర్శి టీడీపీ కార్యాలయంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధాశ్రమంలో అన్నదా నం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.