సీబీఎన్‌ ఫోరం ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు

బాచుపల్లి, మహానాడు: సీబీఎన్‌ ఫోరం ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు శనివారం బాచుపల్లిలోని మీనాక్షి ఓల్డేజ్‌ హోమ్‌ ఫౌండేషన్‌లో ఘనంగా జరిగాయి. కేక్‌ కట్‌ చేసి వయోవృద్ధులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, స్నాక్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీబీఎన్‌ ఫోరం కోర్‌ టీం సభ్యులు అనిల్‌, హరీష్‌, కిరణ్‌ కలపాల, నిర్మల్‌కుమార్‌, సునీత, అమూల్య, శివకుమార్‌, అభిరామ్‌, రాజేంద్రప్రసాద్‌, సురేష్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ కిరణ్‌ కలపాల కృతజ్ఞతలు తెలిపారు.