చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను రాష్ట్ర ప్రజలు నమ్మలేదు
ఓటుతో సైకో పాలనను సాగనంపారు
నంద్యాల నుంచే సైకో అరాచక పాలనకు చరమగీతం
రాష్ట్ర మైనార్టీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా మచ్చలేని ప్రజానాయకుడిగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, కార్య దక్షత కలిగిన నాయకుడిగా అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి టెర్రరిస్ట్ పాలనను తలపింపచేసిన సైకో జగన్ ప్రభుత్వానికి ప్రజలందరూ తిరుగులేని విధంగా ఓటుతో బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేశారని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో టెర్రరిస్టు పాలనను తలపించేలా సైకో జగన్ నేతృత్వంలో ఐదేళ్ల వైసీపీ పాలన లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోయిందని ద్వజమెత్తారు.చంద్రబాబుపై అవినీతి ఆరోపణలను రాష్ట్ర ప్రజలు నమ్మలేదని అన్నారు.
నంద్యాల నుంచే సైకో అరాచక పాలనకు చరమగీతం పాడి ఓటుతో సైకో పాలనను సాగనంపారని మంత్రి పేర్కొన్నారు.ప్రజా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమఅరెస్టుకు ఏడాది అయిందన్నారు. 14 సంవత్సరాలు చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం ధ్యేయంగా పాలన చేశారని,నీతి, నిజాయితీ, చట్టబద్దత, పారదర్శకత చంద్రబాబు ప్రత్యేకత అని ప్రజలందరూ విశ్వసించడంతోనే చంద్రబాబును అక్రమ అరెస్టు చేస్తే వర్గాలకు అతీతంగా రాష్ట్ర ప్రజలందరు ఖండించారని పేర్కొన్నారు.
అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం చంద్రబాబు అరెస్టును ఖండించాయని, దేశవ్యాప్తంగా మద్దతు పలికారని,70 దేశాల్లో చంద్రబాబుకు సంఘీభావ ప్రదర్శనలు చేసిన విషయం దేశ రాజకీయాల్లోనే ఒక మచ్చలేని నాయకుడికి ప్రజా మద్దతు ఏ స్థాయిలో ఉంటుందో నిరూపణ జరిగిందని పేర్కొన్నారు.