Mahanaadu-Logo-PNG-Large

యూపీపీఎస్సీ చైర్మన్‌కు చంద్రబాబు లేఖ

అధికారులకు పదోన్నతుల నిర్ణయంపై సమీక్షించాలి
ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో సీఎస్‌ నిర్ణయం సరికాదు

అమరావతి, మహానాడు : రాష్ట్ర కేడర్‌ అధికారులను ఐఏఎస్‌లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ప్రతిపాదనలు పంప డం నిబంధనలకు విరుద్ధమని, జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు ఉన్నందు వల్ల పదోన్నతులు చేపట్టడం సరైన నిర్ణయం కాదని పేర్కొంటూ ఆ నిర్ణయాన్ని సమీక్షించాలని యూపీపీఎస్పీ చైర్మన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం లేఖ రాశారు. మొండితనంతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఈ పదోన్నతుల జాబితాలో ఉన్నవారు కూడా కేవలం సీఎంఓలో ఉన్నవారేనని తెలిపారు.

జాబితా కూడా నిబంధనల ప్రకారం రూపొందించలేదని, సరైన విధానాలు అనుసరించకుండా పదోన్నతులు కట్టబె ట్టేందుకు జాబితాను రూపొందించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం హడావిడిగా ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టిందని, పారదర్శకత లేకుండా రూపొందించిన జాబితాను పున:పరిశీలించాలని, పదోన్నతుల అంశాన్ని జూన్‌ 7 తర్వాత చేపట్టేలా చూడా లని విజ్ఞప్తి చేశారు. లేఖ కాపీలను పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ సెక్రటరీ, కేంద్ర ఎన్నికల సంఘం, ఎలక్షన్‌ కమిషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి పంపారు.