బీసీ బిడ్డల అభ్యున్నతే చంద్రబాబు ధ్యేయం

* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ
* పెనుకొండ బీసీ హాస్టల్ శాశ్వత భవన ప్రారంభం
* అధికారంలోకి రాగానే బీసీ హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు మంజూరు చేసిన చంద్రబాబు
* 11 నెలల డైట్ బిల్లుల బకాయిలు కూడా చెల్లింపు
* రొద్దం-1 ఎంజేపీ స్కూల్ కు రూ.22.50 కోట్లు మంజూరు
* పెనుకొండలో రూ.6 కోట్లతో టీటీడీ కల్యాణ మండపం నిర్మాణం
* త్వరలోనే శంకుస్థాపన : మంత్రి సవిత

పెనుకొండ : 11 నెలల డైట్ బిల్లులు కూడా ఇవ్వడని ముర్ఖుడు జగన్ రెడ్డయితే…అధికారంలోకి రాగానే బీసీ హాస్టళ్లు, రెసిడెన్సియళ్ల స్కూళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు, బకాయి ఉన్న డైట్ బిల్లులను చెల్లించిన ఘనత సీఎం చంద్రబాబునాయుడదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియే జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. బీసీ బిడ్డలు అన్ని రంగాల్లోనూ రాణించాలని, వారి అభ్యున్నతే సీఎం చంద్రబాబునాయుడు ధ్యేయమని అన్నారు. పెనుకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ బీసీ కళాశాల హాస్టల్ శాశ్వత భవనాన్ని మంత్రి సవిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సవితమ్మ ప్రసంగించారు.

రాష్ట్రంలో బీసీ హాస్టళ్లను అన్న ఎన్టీఆర్ ప్రారంభించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీ బిడ్డల చదువు కోసం మరింత ప్రాధాన్యమివ్వసాగారన్నారు. బీసీ హాస్టళ్లను, రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నారన్నారు. పెనుకొండ మండల కేంద్రంలో బీసీ హాస్టల్ ను ప్రైవేటు భవనం కొనసాగిస్తున్నారన్నారు. ఇటీవల తనను కలిసి స్థానిక టీడీపీ నాయుకులు…బీసీ హాస్టల్ విద్యార్థుల కష్టాలను తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. తక్షణమే శాశ్వత వసతి కోసం కొన్ని భవనాలను పరిశీలించామని, పెనుకొండ ఐటీఐ కోసం మాజీ మంత్రి, దివంగత పరిటాల రవి నిర్మించిన భవనం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఆ భవనాన్ని పరిశీలించి చిన్న చిన్న మరమ్మతులు చేపట్టి బీసీ విద్యార్థులకు శాశ్వత వసతి కలిగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. చుట్టూ పచ్చదనం, సువిశాలమైన భవన సదుపాయం బీసీ బిడ్డలకు లభించిందన్నారు. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా అందిస్తున్నామని, విద్యార్థులంతా మెరుగైన ఫలితాలు తీసుకురాలని మంత్రి సవితమ్మ అభిలషించారు.

రొద్దం-1 ఎంజేపీ స్కూల్ కు రూ.22.50 కోట్లు మంజూరు

నా ఎస్సీలు… నా ఎస్టీలు…నా బీసీలు…అని కబుర్లు చెప్పిన జగన్ రెడ్డి అన్ని హాస్టళ్లను గాలికొదిలేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కనీసం బల్బులు, పగిలిపోయిన కుళాయి ట్యాప్ లను మార్చుకోడానికి మరమ్మతు నిధులివ్వలేదన్నారు. 11 నెలల డైట్ బిల్లు కూడా ఇవ్వని మూర్ఖుడు జగన్ రెడ్డి అని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి హాస్టళ్ల దుస్థితిని తీసుకెళ్లామన్నారు. తక్షణ మరమ్మతులకు రూ.10 కోట్లు కావాలని కోరగా, రూ.20 కోట్లను సీఎం చంద్రబాబు మంజూరు చేశారని కొనియాడారు. బీసీ బిడ్డల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్దికి నిదర్శమన్నారు. డైట్ బిల్లులు సైతం ఆగస్టు వరకు సీఎం చంద్రబాబు క్లియర్ చేశారన్నారు. పెనుకొండ నియోజక వర్గంలోని రొద్దం-1 ఎంజేపీ స్కూళ్ల కోసం రూ.22.50 కోట్ల ను మంజూరు చేశారన్నారు. త్వరలో సోమందేపల్లి బాలిక రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభించనున్నామని మంత్రి వెల్లడించారు. పెనుకొండలో ఉన్న బీసీ బాలిక వసతి గృహానికి సైతం త్వరలో మరమ్మతులు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు..

రూ.6 కోట్లతో టీటీడీ కల్యాణమండపం నిర్మాణం

పెనుకొండలో టీటీడీ కల్యాణమండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. రూ.6 కోట్లతో ఈ కల్యాణమండపాన్ని నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే కల్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో RDO ఆనందరావు గారు టీడీపీ నాయకులు, బీసీ వెల్ఫేర్ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.