Mahanaadu-Logo-PNG-Large

నేడు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు

సాయంత్రం 4.41 గంటలకు ముహూర్తం
అనంతరం ఐదు ఫైళ్లపై సంతకాలు
తొలి సంతకం మెగా డీఎస్సీ
రెండో సంతకం ల్యాండ్‌ టైటిలింగ్‌ రద్దు
మూడో సంతకం రూ.4 వేలకు పింఛన్‌ పెంపు
నాలుగో సంతకం అన్న క్యాంటిన్ల పునరుద్ధరణ
ఐదో సంతకం స్కిల్‌ సెన్సెస్‌

అమరావతి: ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4:41 నిమిషాలను ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో హామీల అమలుకు సంబంధించి ఐదు ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుపై రెండో సంతకం, పింఛన్‌ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్‌ సెన్సెస్‌పై ఐదో సంతకం చేయనున్నారు.