-రెండురోజులు కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ
-ఏర్పాట్లు చేయాలని నాయకులకు ఆదేశం
-175 సీట్లకు 120 మంది పరిశీలకులపై అభ్యంతరం
-ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని వ్యాఖ్య
హైదరాబాద్: విదేశీ పర్యటన నుంచి తిరిగివచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం పార్టీ కీలక నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ నెల 31న శుక్రవారం పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం, జూన్ 1న జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణకు సంబంధించిు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ రోజు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈసీ, డీజీపీకి లేఖ రాయాలని టీడీపీ నిర్ణయించారు. 175 నియోజకవర్గాలకు 120 మంది పరిశీలకులను నియమించ డం పట్ల టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. గురువారం సాయంత్రం అమరావతి రానున్నట్లు తెలిపిన ఆయన పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటమికి వైసీపీ నేతలు కారణాలు వెతుకుతున్నారని, ఈసీ, పోలీసులపౖౖె అందుకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.