పల్నాడు జిల్లా నేతలతో చంద్రబాబు సమీక్ష

సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లిలో పల్నాడు జిల్లా పరిధిలోని నియోజకవర్గాల టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ కర్తలతో ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, వినుకొండ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్‌ యార్లగడ్డ లెనిన్‌, జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశీను రాయల్‌ తదితరులు పాల్గొన్నారు.