ప్రకాశం జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు
ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదులు
మంగళగిరి: పోలింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సభ్యులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పార్టీ సూచనల మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు, పోలింగ్ నిలిచిన కేంద్రాల్లో అదనపు సమయం, అదనపు పోలీసు బందోబస్తు కోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పోలింగ్ అధికారులు, పోలీసులతో సమాచారాన్ని పంచుకు న్నారు.
ఈ ఘటనలపై నియోజకవర్గ ఏఆర్‌ఓలకు, జిల్లా ఎన్నికల ఫిర్యాదు కేంద్రానికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేశారు. టీడీపీ నాయకులకు తదనుగుణంగా సూచన లు చేశారు. కమిటీ సభ్యులుగా నూకసాని బాలాజీ, పార్టీ రాష్ట్ర రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి, ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వై.వి.సుబ్బారావు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి బొద్దులూరి ఆంజనేయులు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి మొగల్ కాలేషా బేగ్, టీడీపీ జిల్లా కార్యాలయ కార్యదర్శి డాక్టర్ పసుపులేటి పాపారావు, కనిగిరి నియోజకవర్గ మాజీ ఎంపీపీ బేరీ పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు.