మంచు మనోజ్ తో కలిసి ఝుమ్మంది నాదం సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ తాప్సి. టాలీవుడ్ లో కెరీర్ ఆరంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ సూపర్ స్టార్, బాద్ షా షారుఖ్ ఖాన్ తో కలిసి ఈ అమ్మడు చేసిన సినిమా డుంకీ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కమర్షియల్ గా ఈ అమ్మడు మరింత బిజీగా సినిమాలు చేయబోతుంది. ఇంతకు ముందు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేసిన ఈ అమ్మడు ఇప్పుడు అన్ని సినిమాలు చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్ గా వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన చీర కట్టు ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా చీర కట్టు లో నడుము నాభి అందం చూపిస్తే వైరల్ అవుతాయి. ఈ ఫోటోల్లో పెద్దగా స్కిన్ షో చేయకున్నా కూడా భలే ఉందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముక్కు పుడక పెట్టుకుని, చీర కట్టుకుని ఈ అమ్మడు కెమెరా కి ఇచ్చిన ఫోజ్ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తెలుగు లో మళ్లీ ఈ అమ్మడు స్టార్ హీరోలకు జోడీగా నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.