దాతలకు జేజేలు!

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు దాతృత్వంతో ముందుకు వస్తున్న దాతలకు జేజేలు పలికారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. బెజవాడ ప్రజలకు మేమున్నామంటూ దర్శి ప్రాంత వ్యాపార వర్గాలు తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థల వారు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. దర్శి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ద్వారా సోమవారం పలువురు తమ సాయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి అందించాలని కోరారు.

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలిపారు. డాక్టర్ లక్ష్మీ తో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు శెట్టి పిచ్చయ్య, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

దాతల విరాళాలు..

గొర్రె సుబ్బారెడ్డి-రూ.10,000
దమా క్రిష్ణ -రూ.10,000
ఫనిడపు కోటయ్య-రూ.10,000
సనే సుబ్బయ్య-రూ. 10,000
వెంకటనారాయణ-రూ. 10,000
ఈ కార్యక్రమం లో దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దాతలు గొర్రె సుబ్బారెడ్డి, దమా క్రిష్ణ, ఫనిడపు కోటయ్య, సనే సుబ్బయ్య, వెంకటనారాయణ పాల్గొన్నారు.