– టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి డిమాండ్
చంద్రగిరి, మహానాడు: చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దమ్ముంటే ఎమ్మెల్యే పులివర్తి నాని భార్య సుధా రెడ్డికి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు చేశారు. నాని కుటుంబంపై అసత్య ప్రచారాలు చేయడం మాని ఆధారాలు ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనచైతన్య సంస్థలో ఏడు వేల రూపాయల జీతానికి పనిచేసిన చెవిరెడ్డి వేల కోట్లుకు అధిపతి ఎలా అయ్యోరో వివరణ ఇవ్వాలని కోరారు. చంద్రగిరి అభివృద్ది గాలికి వదిలి ల్యాండు, శ్యాండు, కమిషన్ల కోసం తపించిన చెవిరెడ్డికి చంద్రగిరి పేరు ఉచ్చరించడానికి కూడా అర్హత లేదన్న ఆమె విమర్శకు ఆయన వద్ద జవాబు లేదన్నారు.
చెవిరెడ్డి నిర్లక్ష్యం వల్ల చంద్రగిరి 25 ఏళ్ళ వెనక్కు పోయిందని అన్నారు. సీఎం చంద్రబాబు ఆశీస్సులతో చంద్రగిరి పూర్వ వైభవం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది చూసి ఓర్వలేకనే చెవిరెడ్డి నాని కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని చెప్పారు. అవినీతి సొమ్ముతో కుక్కర్లు, గడియారాలు పంచితే చంద్రగిరి ప్రజలు ఓట్లు వేయరని చెవిరెడ్డి గుర్తించాలన్నారు.
జగన్ పాలనలో పలు కీలక పదవులు అనుభవించిన చెవిరెడ్డి చంద్రగిరి అభివృద్ధిని గాలికి ఒదిలి అవినీతి సొమ్ముతో అందలం ఎక్కారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో అభివృద్ది పరుగులు తీస్తున్నదని చెప్పారు. చంద్రగిరిలో కూడ అనేక అభివృద్ది పనులు చేపట్టామని చెప్పారు. సుధా రెడ్డి అన్నా అంటూ మర్యాదగా చేసిన ఆరోపణలకు అంతే హుందాగా చెవిరెడ్డి జవాబు చెప్పాలని సూచించారు. దొంగ భక్తి ప్రదర్శించకుండా నిజాయితీ చాటుకోవాని కోరారు. దమ్ము, ధైర్యం ఉంటే భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి చంద్రగిరిలో జరిగిన అభివృద్ది, అవినీతిపై సుధా రెడ్డితో బహిరంగ చర్చకు సిద్దం కావాలని సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు.