వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్: జగన్‌రెడ్డి లాంటి స్టిక్కర్ల సీఎంని రాష్ట్ర చరిత్రలోనే చూడలేదని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల ప్రచారాలపై ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పలు ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు పథకాలకు పేర్లు మార్చడం, కేంద్ర ప్రభుత్వ పథకాలపై స్టిక్కర్లు వేసుకోవడం మినహా ఈ దిక్కుమాలిన మనిషి ప్రజల కోసం కొత్తగా చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 2.70 లక్షల కోట్ల ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ చేశామని ప్రచారం చేసుకుంటున్న జగన్‌రెడ్డి అందులో సగం డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందే అన్న నిజాన్ని ఎందుకు వెల్లడిరచడం లేదు… రాష్ట్రంలో నేటికీ 89 లక్షల రేషన్ కార్డులకు కేంద్రం సరుకులు ఇస్తోంది అవునో కాదో చెప్పాలని ప్రశ్నించారు. పేదలకు పంపిణీ చేయమని కేంద్రం ఇచ్చిన 5.65 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని బొక్కోసిన పందికొక్కులు, బియ్యం దొంగలు ఎవరో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా 8 రకాల సరుకులు అందిస్తే జగన్ వచ్చాక వాటిని బియ్యానికే పరిమితం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపులు మార్చడం వాస్తవం కాదా.. ప్రచారంలో వీటికి కూడా జవాబులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు రైతుభరోసా ద్వారా రూ.13,500 ఇస్తున్నట్లు డప్పులు కొట్టుకుంటున్నావ్…అందులో కేంద్రం వాటా రూ.6 వేల సంగతిని ఎందుకు ప్రస్తావించడం లేదని నిలదీశారు. జల్ జీవన్ మిషన్ వంటి పథకాల్ని ఉయోగించుకోకుండా రాష్ట్రాన్ని దాహం కేకలకు వదిలేసిన దుర్మార్గుడు జగన్‌రెడ్డి అని దుయ్యబట్టారు. అయిదేళ్లలో చేసిన 12 లక్షల కోట్లలో సంక్షేమానికి ఇచ్చిన 1.35 లక్షల కోట్లు పోగా మిగిలిన డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్లింది? 94 వరకు ఉన్న కేంద్ర పథకాల్లో 70 స్కీమ్‌లకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా వాటిని ఎందుకు నిరుపయోగంగా మార్చారు? అన్న అంశాలపై కూడా జగన్ ప్రజలకు వివరించాలన్నారు. ఇవేకాక జగన్ కంటే చంద్రబాబు హయాంలోనే ఎక్కువ సంక్షేమ పథకాలు అందాయని స్పష్టం చేశారు. చంద్రబాబు 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే దానిని 9 లక్షల మందికి కుదించిన ఘనుడు జగన్ అని చురకలు వేశారు. చంద్రబాబు హయాంలో రూ.5 లక్షల వరకు డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలిస్తే దానిని రూ.3 లక్షలకే పరిమితం చేశారు. రైతు రుణమాఫీ, అన్నా క్యాంటీన్లు, నిరుద్యోగ భృత్తి, చంద్రన్న బీమా, విదేశీ విద్య వంటి 100 పైగా సంక్షేమ పథకా లు రద్దు చేసిన జగన్‌రెడ్డికి మళ్లీ ప్రజలను ఓటడిగే అర్హతే లేదన్నారు. ఈ వాస్తవాలను తెలుసుకుని ప్రజలు ఆయనను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.