– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
హైదరాబాద్, మహానాడు: తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి అని తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీర్తించారు.
చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడం గర్వ కారణం. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించినందుకు చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలను చేరుకున్న చిరంజీవిని యువత ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అన్నారు.