సినిమా ముచ్చటే లేదు?

టాలీవుడ్ ఎప్పుడూ స‌మ్మ‌ర్ రిలీజ్ ల‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌దు. హాలీడేస్ సీజీన్ అయినా! ఎందుక‌నో స‌మ్మ‌ర్ రిలీజ్ అంటే ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు వెన‌క‌డుగు వేయ‌డం అంత‌కంత‌కు స‌న్న‌గిల్లుతుంది. ఐదారేళ్ల క్రితం క‌నీసం ఒక అగ్ర‌హీరో సినిమా అయినా థియేర్టోఆడేది. ఇప్పుడా స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపిచండం లేదు. హీరోలంతా పండ‌గ సీజ‌న్ల‌నే టార్గెట్ చేయ‌డంతో స్టార్ హీరోలు స‌మ్మర్ కి క‌రువుతున్నారు. టైర్-2 హీరోలు కూడా పండ‌గ‌ల్నే టార్గెట్ చేస్తున్నారు. బాల‌న్ స్టార్ హీరోల రిలీజ్ కి వారం ముందు గానీ..వారం త‌ర్వాత గానీ వ‌చ్చేలా చూసుకుంటున్నారు. ఓ సారి తాజాగా రిలీజ్ అయిన సినిమాల సంగ‌తి చూస్తే థియేట‌ర్లు ఏమాత్రం జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడం లేదు. ఏపీలో ఎన్నిక‌లు స‌హా..ఐపీఎల్ మ్యాచ్ లు జ‌ర‌గ‌డంతో జ‌నాల అటెన్ష‌న్ అంతా ఆ రెండిటీపైనే ఉంది. ఏపార్టీ గెలుస్తుంది? ఎవ‌రు సీఎం అవుతారు? ఏ మ్యాచ్ గెలుస్తుంది? ఎవ‌రు బాగా ఆడారు? ఈ టాపిక్ త‌ప్ప సినిమా అనే ముచ్చ‌టే జ‌నాల్లోఎక్క‌డా క‌నిపించ‌లేదు.  వాట్సాప్‌పై సోనూసూద్ ఫైరింగ్ పైగా స్టార్ హీరో సినిమా ఒక్క‌టి కూడా లేక‌పోవ‌డంతో థియేట‌ర్ల‌న్నీ బోసుపోతున్నాయి. మొన్న‌టివ‌ర‌కూ `టిల్లు స్క్వేర్` హ‌డావుడి క‌నిపించింది. ఇప్పుడా సినిమా ఓటీటీలో కూడా అందుబాటులోకి వ‌చ్చేసింది. థియేట‌ర్లో ర‌న్నింగ్ లో ఉన్నా! ఓటీటీలోనూ మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఇక విజయ్ దేవరకొండ `ఫ్యామిలీ స్టార్` కి థియేట‌ర్ రిలీజ్ లో నెగిటివ్ టాక్ వ‌చ్చినా అమెజాన్ ప్రైమ్ లో ఆద‌ర‌ణ బాగానే క‌నిపిస్తుంది. ఒక్క‌సారైనా చూడొచ్చ‌ని జ‌నాలు ఆ సినిమా కూడా బాగానే చూస్తున్నారు.అలాగే గోపీచంద్ న‌టించిన `భీమా` సినిమాకి కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. కొత్త సినిమాలు లేక పోవ‌డంతో ఉన్న‌సినిమాల్లో ఇవే బెస్ట్ గా భావించి ఆడియ‌న్స్ వాటికే ఓటేస్తున్నారు. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌ల‌యాళం హిట్ మూవీ `మంజుమ్మ‌ల్ బోయ్స్` కోసం ఓటీటీ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు అనువాదంలోనూ ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే విశాల్ ర‌త్నం కూడా థియేట‌ర్లోకి వ‌చ్చింది కానీ అది ఊర మాస్ కంటెంట్ కావ‌డంతో ఆడియన్స్ కి ఎక్క‌లేదు. క‌నీసం ఆసినిమా అయినా హిట్ టాక్ తెచ్చుకుంటే కాస్తైనా థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడేవి. ఇది కూడా ఓటీటీలో చూడాల్సిన సినిమా అని ఆడియన్స్ ఫిక్సై పోయారు.