వినాయక నిమజ్జనంలో ఘర్షణ

– ముగ్గురికి గాయాలు

మచిలీపట్నం, మహానాడు: స్థానిక ఎనిమిదో డివిజన్‌ అంజమ్మ కాలనీలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో విగ్రహం నిమజ్జనం కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఊరేగింపులో పాల్గొన్న ఐదుగురు వ్యక్తులు రఫీ ఇంటిపై రాళ్లు విసిరి, దాడి చేశారు. రఫీ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరికి కూడా గాయాలు అయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపాడు. ఫిర్యాదు ఇచ్చి ఇంటికి వెళ్ళగానే మాపై కంప్లైంట్ ఇస్తావా? ఏంటి నీకు అంత ధైర్యం? అని రఫీ తల పగలగొట్టారు. వెంటనే రఫీ రోడ్డుపైకి పరిగెత్తగా ఎస్సై వచ్చి రఫీని కాపాడి దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులను వెంటనే పట్టుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. రఫీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.