మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్!

మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది. ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన క్లాడియా షీన్బామ్ 60% ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇటు ప్రతిపక్ష అభ్యర్థిగానూ మహిళే బరిలో నిలిచారు. విపక్షానికి చెందిన గాల్వెజ్కు 30% ఓట్లు వస్తాయని అంచనా. కాగా ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు.