పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు

త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ, మహానాడు :  వినుకొండ పట్టణ పుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే 3 సింగర చెరువులను సాగర్ జనాలతో నింపగా సోమవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మునిసిపల్ అధికారులతో కలిసి చెరువులను సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్నాడు ప్రాంత ప్రజలు త్రాగునీటికి పడుతున్న ఇబ్బందులను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళగానే స్పందించి నాగార్జునసాగర్ డ్యాం డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పటికీ కుడికాలువకు తాగునీటిని విడుదల చేసి ప్రజలను ఆదుకున్నాడని తెలిపారు. సాగర్ జలాలు విడుదల చేసేందుకు ఇరిగేషన్, మున్సిపల్ శాఖల మంత్రులు రామానాయుడు, నారాయణలు చెప్పిన చొరవ అభినందనీయం అన్నారు. త్రాగునీటికై సాగర్ జలాలతో మూడు చెరువులు నింపడం జరిగిందని, స్వచ్ఛమైన త్రాగునీటి సరఫరా చేసేందుకు ఫిల్టర్ బెడ్లను మార్చడం జరిగిందన్నారు. రోజు మార్చి రోజు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం

వినుకొండ పట్టణానికి శాశ్వతంగా త్రాగునీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని, 159 కోట్ల నిధులతో మంచినీటి పథకాన్ని పూర్తి చేయడం జరుగుతుందన్నారు.మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు మాట్లాడుతూ చెరువులో నీటి సామర్థ్యం తగ్గగానే ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సందర్శించి నెలకొన్న త్రాగునీటి సమస్యను ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి కుడి కాలువకు నీరు విడుదల చేయించి పల్నాడు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కృషి మరువలేనిదన్నారు. సింగర్ చెరువుతోపాటు నియోజకవర్గంలో ఉన్న త్రాగునీటి చెరువుల మొత్తం సాగర్ జలాలతో నింపి ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించారని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, డి ఈ వెంకయ్య, టిడిపి నాయకులు పఠాన్ అయూబ్ ఖాన్, పీవీ సురేష్ బాబు,పత్తి పూర్ణ చంద్రరావ్ ,వంకాయలపాటి పెరయ్య, పువ్వాడ కృష్ణ మురికిపూడి నసరయ్య, తదితరులు పాల్గొన్నారు