– కమిషనర్ పులి శ్రీనివాసులు
గుంటూరు, మహానాడు: గాంధీ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించడం ద్వారా స్వచ్ఛ గుంటూరు సాధించుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం స్వచ్ఛతా హి సేవాలో భాగంగా కమిషనర్, అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు సైకిల్ ని వినియోగించి, జిఎంసి కార్యాలయం దగ్గర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జిటి రోడ్డును అధికారులు, ప్రజారోగ్య కార్మికులతో కలిసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వచ్ఛతోపాటు, పరిసరాల స్వచ్ఛతను పాటించడం ద్వార స్వచ్ఛ గుంటూరు సాధించుకోవచ్చన్నారు. స్వచ్ఛతా హి సేవా లో భాగంగా గురువారం ఉదయం అధికారులు, సిబ్బంది, వార్డ్ సచివాలయ కార్యదర్శులు తమ రోజు వారీ విధులకు సైకిల్ ని వినియోగించారన్నారు. సైకిల్ వినియోగం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గటమే కాకుండా, శారీరక ఆరోగ్యం కూడా దక్కుతుందన్నారు. నగరం ప్రజలు స్వచ్చత హి సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని కోరారు.
కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎస్ఈ శ్యాం సుందర్, ఎంహెచ్ఓలు మధుసూదన్, రామారావు, మేనేజర్ ప్రసాద్, జిఎంసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.