పాఠశాలల తొలిరోజే దుస్తులు, పుస్తకాలు

తెలంగాణ చరిత్రలో మొదటిసారి కార్యక్రమం
ఖమ్మంలో పంపిణీని ప్రారంభించిన భట్టివిక్రమార్క

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటిరోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసింది. ఖమ్మం పట్టణంలోని ఎన్‌ఎస్‌టీ రోడ్డులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిల్లలకు బుధవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క దుస్తులు, పుస్తకాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు విద్యకు మా ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.