విశాఖ: పెందుర్తి..రాంపురంలో సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం యాత్రలో ముఖ్యమంత్రిని కలిసిన దివ్యాంగులైన కవలలు. ట్రైసైకిల్ లో వచ్చి మరీ సీఎంని కలిసిన కవల సోదరులు. జి.జీవన్ కుమార్, జి.తరుణ్ కుమార్ తమ పై చదువులకు ముఖ్యమంత్రి సహాయం కోరారు. వీరిలో జీవన్ కుమార్కు ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 815 మార్కులు వచ్చాయి. వైకల్యాన్ని అధిగమించి ఉన్నతశిఖరాలు చేరుకోవలనుకుంటున్నామని, అందుకు జగనన్న సహకారం కావాలని వారు కోరారు. కవల సోదరులను ఆత్మీయంగా పలకరించి, వారికి తగిన సహాయం అందిస్తామని సీఎం భరోసా కల్పించారు.