మంగళగిరి, మహానాడు: తెలుగు తేజోమూర్తి.. దళిత వర్గ జ్వాలా స్ఫూర్తి.. సంఘ సంస్కరణే లక్ష్యంగా సాహితిలోకంలో కిర్తి గడించి కులవివక్షను రూపుమాపేందుకు కృషి చేసిన పద్మభూషన్ గుర్రం జాఘువా జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రచనలను గుర్తుచేసుకున్నారు. విశ్వమానవ సమానత్వం కోసం ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గబ్బిలం, కొత్తలోకం లాంటి గొప్ప రచనలతో మానవుల్లో మలినాలను తొలగించేందుకు ఆయన కృషి చేశారన్నారు.
కవితా విశారద, కవికోకిల, కవిదిగ్గజ, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యడై ఎన్నో బిరుదుల అందుకున్నారని తెలిపారు. నేటి యువత కులాల కుంపట్లో ఇరుక్కోకుండా.. సమాజ హితంకోసం పాటుపడాలని నేతలు కోరారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్, మంత్రులు వంగలపూడి అనిత, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్, ఏపీ స్టేట్ కన్జ్యూమర్ కౌన్సిల్ చైర్మన్ పీతల సూజాత, మీడియా కో ఆర్డినేటర్ నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.