కేంద్ర మంత్రి పాటిల్ ని కలిసిన సీఎం చంద్రబాబు నాయుడు

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల శక్తి మంత్రివర్యులు సి ఆర్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు భారీ ఎత్తున నిధులు కేటాయింపునకు తోడ్పడినందుకుగాను అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు పాల్గొన్నారు.