కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి.. కుమారుడు, మంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ ఉన్నారు. అంతకుముందు ఆలయం వద్ద సీఎంకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.