– పార్టీ శ్రేణులు, అధికారులకు కృతజ్ఞతలు
– దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు
– మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర
విజయవాడ, మహానాడు: అకాల వర్షాలతో కృష్ణానది, బుడమేరు నుంచి వచ్చిన వరద వల్ల విజయవాడ నగరం ముంపునకు గురైందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఇక్కడి కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
• కలెక్టరేట్ కేంద్రంగా సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు నిర్విరామంగా ఫీల్డ్ విజిట్ చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సేవలు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు మరిచిపోరని అందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. వరదల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా అతలాకుతలం అయిందని.. ముఖ్యమంత్రి సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.
– . 32 డివిజన్ల లో వరదల వల్ల ప్రజలు నష్టపోగా, జక్కంపూడి, అంబాపురం వంటి ప్రాంతాల్లో కలుపుకొని 179 సచివాలయాల్లో టీం వర్క్ తో ముందుకు వెళ్లారు.
• ముఖ్యమంత్రి అపార అనుభవంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ తొమ్మిది రోజుల్లోనే విజయవాడ నగరం సాధారణ స్థితికి చేరేలా కృషి చేశారు. బుడమేరుకు పడిన గండ్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ క్లోజ్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేశారు.
. మంత్రి లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మంత్రి రామానాయుడు, నారాయణలు కూడా నిరంతరం పనిచేసారు.
– మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తూ శానిటేషన్, వాటర్ సప్లై అందేలా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, విద్యుత్ కనెక్షన్లు 100% కరెంటు ఇవ్వగలిగినందుకు వారి కృతజ్ఞతలు.
– కోటి 20 లక్షల ఫుడ్ ప్యాకెట్స్,, రేషన్ ను 2,40,000 మందికి సప్లై చేయాల్సి ఉండగా రెండు లక్షల 187 మందికి ఆరు రకాల వస్తువులతో సప్లై చేయగలిగామన్నారు.
– . 150 బోట్లు, 24 ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు, 6 హెలికాప్టర్ల తో వరద బాధిత ప్రాంతాల్లో సేవలందించగలిగారు.
– నూతన సాంకేతికతను అందుబాటులో తెచ్చి డ్రోన్స్ ద్వారా ఫుడ్ పాకెట్స్ మనుషులు వెళ్లలేని చోటుకు కూడా అందించాం.
– కనీవిని ఎరుగని రీతిలో సాంకేతికతను ఉపయోగించారు.
– ఇప్పటివరకు ప్రజలు, ఉద్యోగులు ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి 270 కోట్లు విరాళాలుగా అందించినందుకు అభినందిస్తున్నాం.
– ఇలాంటి విపత్తులు అందరూ ఇన్వాల్వ్ కావటం మంచి పరిణామం.
– ముఖ్యమంత్రి వినాయక చవితిని కూడా విజయవాడ కలెక్టరేట్లో చేసుకోవటం ఆయన అంకితభావానికి నిదర్శనం
– సెంట్రల్ టీం రెండోసారి వస్తుంది.
– మంత్రులు, అధికారులు ఇందులో భాగస్వామ్యమైన వారందరికీ అభినందనలు.