ఎంబీబీఎస్ లో సీటు పొందిన గిరిజన బాలికకు సీఎం సాయం

హైదరాబాద్‌, మహానాడు: గిరిజన బాలిక సాయిశ్రద్ధ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా, జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఈ సంగతి సీఎం దృష్టి వెళ్ళడంతో డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి, ఈ మేరకు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు సాయిశ్రద్ద, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.