ఉచిత ఇసుకపై సాగుతున్న అసత్య ప్రచారంపై సీఎం సీరియస్

– కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు

ఉచిత ఇసుక విధానంపై సామాజిక మాధ్యమం వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా పారదర్శక విధానంలో రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందిస్తున్నప్పటికీ, ప్రజలను తప్పుదారి పట్టించేలా జరుగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర భూగర్భ, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాను సిఎం అదేశించారు.

ఉద్దేశ పూర్వకంగా అబద్దాలతో ఉచిత ఇసుక విధానంపై ప్రజలలో అనుమానాలు రేకెత్తే లా జరుగుతున్న ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని స్పష్టం చేశారు. ఇందుకు అయా జిల్లాల పాలనాధికారులు, పోలీస్ సూపరిండెంట్ లకు తగిన అదేశాలు జారీ చేయాలని, ఈ తరహా వ్యవహారాలపట్ట కఠినంగా వ్యవహరించాలని మీనాను అదేశించారు.

ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానంపై జిల్లా స్ధాయిలో నిజనిజాలను వెలికితీసి బాధ్యులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి గనులశాఖ ముఖ్య కార్యదర్శికి స్పష్టమైన అదేశాలు జారీ చేశారు.