రావణ రాజ్యం పోవాలని మొక్కుకున్నట్లు వెల్లడి
పోలీసులు వైసీపీ కొమ్ముకాస్తున్నారని వ్యాఖ్యలు
తిరుపతి, మహానాడు : తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ దర్శించుకున్నారు. అనంతరం రంగనా యక మండపంలో వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు. టీటీడీ అధికా రులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సీఎం రమేష్ మాట్లాడు తూ రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని స్వామివారిని కోరు కున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని ఓట్లు వినియోగించుకు న్న ప్రతిఒక్కరి క్షేమం కోసం స్వామివారి దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు రాజ్యం పోయింది…ప్రజల రాజ్యం వచ్చిందని వ్యాఖ్యా నించారు. పోలీసులు తమ డ్యూటీ చేస్తున్నారని, కొంతమంది అధికారులు మాత్రం ఇంకా వైసీపీకి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.