సీఎం రేవంత్‌ రెడ్డి టీచర్స్‌ డే శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మహానాడు: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులది బాధ్యత చాలా గొప్పదని సీఎం అన్నారు. దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడంలో, రాష్ట్ర సాధన ఉద్యమంలో అధ్యాపకులది కీలక పాత్ర అని, అలాంటి గురువులను ప్రజాప్రభుత్వం సమున్నతంగా గౌరవిస్తోందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.