Mahanaadu-Logo-PNG-Large

కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వాన లేఖ

-తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానం
-స్వయంగా అందజేయాలని ప్రొటోకాల్‌ సిబ్బందికి ఆదేశం
-కేసీఆర్‌ సిబ్బందితో మాట్లాడిన ప్రొటోకాల్‌ ఇన్‌చార్జ్‌
-గజ్వేల్‌ ఫామ్‌హౌస్‌లో అందజేసేందుకు పయనం

హైదరాబాద్‌: జూన్‌ 2వ తేదీన ఉదయం 10 గంగలకు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్ర మంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రత్యేకంగా లేఖను రాశారు. దానిని స్వయంగా కేసీఆర్‌ను కలిసి అందించాలని ప్రభుత్వ సలహాదారు, ప్రొటోకాల్‌ ఇన్‌చార్జ్‌ హర్కర వేణుగోపాల్‌, డైరెక్టర్‌ అరవింద్‌సింగ్‌లకు బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్‌ సిబ్బందితో మాట్లాడారు. గజ్వేల్‌ ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ ఉన్నారని వారు తెలపడంతో అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, లేఖను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.