భువనగిరి పార్లమెంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, మహానాడు: హైద్రాబాద్‌లో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి భువనగిరి పార్లమెంట్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌ రెడ్డి, భువనగిరి పార్లమెంట్‌ అభ్యర్థి కిరణ్‌కుమార్‌, భువనగిరి పరిధిలోని ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌, సామెల్‌, మల్‌రెడ్డి రంగారెడ్డి, భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు.