Mahanaadu-Logo-PNG-Large

ఎమ్మెల్సీ ఉపఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీల మద్దతు
తీన్మార్‌ మల్లన్న గెలుపునకు కృషిచేయాలని పిలుపు

హైదరాబాద్‌, మహానాడు : నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం ఎమ్మెల్సీ ఉపఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్ల న్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం బతకా లంటే తీన్మార్‌ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలవాలని సీపీఐ నాయకులకు పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు.

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండ రాం మాట్లాడుతూ బీజేపీ, బీఆరెస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుం దని ఇప్పటికే స్పష్టం చేశాం. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్‌ను గెలిపిం చాలని, కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జన సమితి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. సీపీఎం నాయకుడు ఎస్‌.వీరయ్య మాట్లాడు తూ ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం కూడా కాంగ్రెస్‌కు మద్దతు పలు కుతుందన్నారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకు ని ఓటు వేయాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను గెలిపించాలని కోరారు.