మార్చి 8న మెట్రో రైలు రెండో దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫలక్‌నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు ఈ రూట్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉంది. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్-మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్లు ఉన్నాయి.
ఈ నెల 8న పాతబస్తీలోని ఫలక్‌నుమా వద్ద పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మార్గంలో ఐదు స్టేషన్లు వుంటాయి. మొత్తం 5.5 కిలోమీటర్ల మార్గంలో చేపట్టనున్న ఈ నిర్మాణానికి సుమారు రూ. 2000 కోట్ల వరకు ఖర్చు కానుంది.