– లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనంద బాబు
అమర్తలూరు, మహానాడు: అమర్తలూరు మండలం పెదపూడి గ్రామానికి చెందిన పెదపూడి కుమారి అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుకున్నారు. చికిత్స కోసం అయిన బిల్ ని వేమూరు నియోజక వర్గ శాసన సభ్యులు నక్కా ఆనంద బాబు వారి రిఫరెన్స్ లెటర్ ద్వారా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి పంపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు రూపం లో రూ. 30,786 మంజూరు చేసి ఉన్నారు. మంజూరు అయిన ఆ మొత్తాన్ని పెదపూడి కుమారి కుటుంబ సభ్యులకు చెక్కు రూపం లో ఆనందబాబు అందజేశారు.
అలాగే, మోపర్రు గ్రామానికి చెందిన సబ్బినేని కల్పన అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుకున్నారు. చికిత్స కోసం అయిన బిల్ ని వేమూరు నియోజక వర్గ శాసన సభ్యుడు నక్కా ఆనంద బాబు వారి రిఫరెన్స్ లెటర్ ద్వారా సీఎంఆర్ఎఫ్ కార్యాలయానికి పంపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు రూపం లో రూ. 23,400 మంజూరు చేసి ఉన్నారు. ఆ మొత్తాన్ని సబ్బినేని కల్పన కుటుంబ సభ్యులకు చెక్కు రూపం లో ఎమ్మెల్యే అందజేశారు.