తుమ్మల ప్రతిపాదనలకు సీఎం ఆమోదం

-మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు సాయం
-టీఎస్‌సీవో ద్వారా శానిటరీ నాప్కిన్ల పరిశ్రమ
-హ్యాండ్లూమ్‌ పార్కులో డిప్లొమా, డిగ్రీ కోర్సులు

హైదరాబాద్‌, మహానాడు: వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పం దించారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌ కనుముక్కలలో 23 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసే ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) లో డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాంలలో విద్యార్థులకు ప్రవేశాల కల్పనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణ కోసం బీసీ వెల్ఫే ర్‌ శాఖ ద్వారా నేతన్నలకు రూ.400 కోట్ల బడ్జెట్‌ వినియోగించుకునేందుకు అం గీకరించారు. టీఎస్‌సీవో ద్వారా శానిటరీ నాప్కిన్లు ఉత్పతి పరిశ్రమను పోచం పల్లిలో స్థాపించుటకు ఆమోదం తెలిపారు. నాప్కిన్లు స్వయం సహాయక సంఘా ల ద్వారా సరఫరా చేయుటకు నిర్ణయించారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి టీఎస్‌సీవోకు రావాల్సిన అన్ని పెండిరగ్‌ బాకాయిలను విడుదల చేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉందని వివరించారు.