విజయవాడ, మహానాడు: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విచ్చేశారు. విజయవాడలో బుడమేరు మునక ప్రాంతంలో సహాయక చర్యలపై అధికారులతో ఆయన సమీక్షించారు. సమీక్షకు అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..
• బుడమేరు వరద బాధితుల కష్టాలు తీర్చే వరకు విశ్రమించేది లేదు
• పాలు, అహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్ లు వెంటనే అన్ని ప్రాంతాల నుంచి తెప్పించాలి
• లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయండి
• ఇతర ప్రాంతాల నుంచి అదనపు బోట్లు, టాక్టర్లు తక్షణం తెప్పించాలి
• సహాయక చర్యలు వేగవంతం కావాలి… తక్షణం అందుబాటులో ఉన్న ప్యాక్డ్ ఫుడ్ బాధితులకు అందివ్వండి
• వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి వెంటనే తరలించాలి
• విజయవాడలో ఉన్న అన్ని షాపుల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలి
• బుడమేరులో ఊహించని స్థాయి వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.
• ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందిద్దాం…. సాయంలో ప్రతి రెండు గంటలకు మార్పు కనిపించాలి
• అక్షయ పాత్ర నుంచి, సరఫరా చేయగలిగిన ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలి…. ఖర్చు గురించి ఆలోచన చెయ్యకండని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.