Mahanaadu-Logo-PNG-Large

వ్యాపారులకు అండగా కూటమి ప్రభుత్వం

జగన్‌ పాలనంతా వేధింపులు, దాడులు, దౌర్జన్యాలే
లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవిందబాబు

నరసరావుపేట: వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నరసరావుపేట టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో కపిలవాయి విజయ్‌కుమార్‌ కళ్యాణ మండపంలో నిర్వహించిన వెండి, బంగారం, డైమండ్స్‌, నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పన్నుల మోత, పోలీసుల వేధింపులతో వ్యాపారులను ముప్పు తిప్పలు పెట్టిన దుర్మార్గుడు జగన్‌ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలున్నా అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గోల్డ్‌ మర్చంట్‌ బులియన్‌ అధ్యక్షుడు కపిలవాయి విజయకుమార్‌, నరసరావుపేట మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయగుప్తా, వేల్పుల సింహాద్రి యాదవ్‌, వీరవల్లి వరదయ్య తదితరులు పాల్గొన్నారు.