వరంగల్ : బీఆర్‌ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘించారని వరంగల్‌లో కేసు నమోదైంది. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నన్నపునేని, ధాస్యం వినయ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఏనుగు రాకేష్ రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులపై ఈ కేసు నమోదైంది. గురువారం ఖిలావరంగల్‌లో కాకతీయ కళాతోరణం దగ్గర బీఆర్‌ఎస్ నేతలు నిరసన తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారంటూ వారిపై మిల్స్ కాలనీ పోలీసుస్టేషన్‌లో రెండు కేసులు నమోదుచేశారు.