కూలుతున్న ‘గ్రేస్‌’ లేని గోడలు!

గుంటూరు, మహానాడు: గుంటూరు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ కు సంబంధించిన గోడలు కూలిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని… అయినా నిమ్మకి నీరెత్తినట్టు కార్పొరేషన్‌ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ ఆరోపించారు. ఇటువంటి పనులపై ముఖ్యంగా కార్పొరేషన్ అధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేపట్టడం లేదని విమర్శించారు. నియమ నిబంధనలను పాటించకపోవడం, కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం, అలసత్వం వల్ల బిల్డింగులు కూలుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని, మున్ముందు మరికొన్ని ఆధారాలతో అక్కడ జరుగుతున్న అక్రమాలు ప్రజల ముందు పెడతానని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.