నరసాపురం, మహానాడు: పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి ముంపుకు గురైన లంక గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఆచంట మండలం అయోధ్య లంక మర్రిమూల గ్రామానికి పడవపై చేరుకున్నారు. నీట మునిగిన లంక గ్రామాలల్లో ద్విచక్ర వాహనం, ట్రాక్టర్ మీద ప్రయాణిస్తూ లంక ప్రజలకు భరోసానిచ్చారు. ఎస్సీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.