చిలకలూరిపేట, మహానాడు: మద్దిరాల పీఎం జవహర్ నవోదయ విద్యాలయ వేదికగా మూడు రోజుల పాటూ జరగనున్న రీజినల్ హ్యాండ్ బాల్ మీట్-2024 పోటీలను కలెక్టర్ అరుణ్ బాబు సోమవారం ప్రారంభించారు. చిలకలూరి పేట మండలం, మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి జెండాను ఆవిష్కరించి, క్రీడా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు.