దివ్యాంగుని దగ్గరకు వెళ్ళి, అర్జీ స్వీకరించిన కలెక్టర్

ప్రకాశం, మహానాడు: ప్రకాశం భవనంలో ‘ మీ కోసం ‘ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులను కలెక్టర్ .ఏ. తమీమ్ అన్సారియా స్వీకరించారు. అర్జీ తీసుకొచ్చిన ఓ దివ్యాంగుని కోసం వేదికపై నుంచి కిందకు దిగివచ్చి అతని వివరాలను తెలుసుకున్నారు. ‘ మీకోసం ‘ అర్జీల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డి.ఆర్.ఓ. విశ్వేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.