అమరావతి: కౌంటింగ్ రోజు అల్లర్లు చేయాలని సూచించిన కేసులో సజ్జలకు తాడేపల్లి పోలీసులు నోటీసులు పంపారు. నిబంధనలు పాటించే ఏజంట్లు అవసరం లేదని ఇటీవల వైసీపీ ఏజెంట్లకు ఇచ్చిన శిక్షణలో ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ లీగల్ టీం వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తాజాగా దానికి సంబంధించి తాడేపల్లి హెడ్ కానిస్టేబుల్ ద్వారా 5వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపారు.