పాడైన పైరుకి పరిహారం : ఎమ్మెల్యే యరపతినేతి

పిడుగురాళ్ల, మహానాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం శాంతినగరం గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రసం పీల్చే పురుగు వల్ల ఆకుముడత, పంట ఎండిపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని, అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు.

గత వైసిపి ప్రభుత్వం లో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదని యరపతినేని విమర్శించారు. గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరని,ఈ ప్రభుత్వం రైతులకు అండ దండగా ఉంటుందని స్పష్టం చేశారు. గురజాల నియోజకవర్గం లో రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్ట నివారణ చర్యలు, నష్టం జరిగిన పైరుకి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తానని వారు తెలిపారు.