మాజీ మంత్రి విడదల రజినిపై ఫిర్యాదు

విజయవాడ: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. విడదల రజిని అక్రమాలపై యడ్లపాడు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం హోం మంత్రి అనితకు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఆమె.. రజిని అక్రమాలపై విచారణకు ఆదేశించారు.