-కోరిక తీర్చమని వేధిస్తున్నాడు…
-నర్సింగ్ గ్రేడ్ 1 అధికారిణి ఆవేదన
విశాఖపట్నం: కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్‌పై వన్‌టౌన్ పోలీ సుస్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఇటీవల కేజీహెచ్‌లో విధుల నుంచి సరెండర్ అయిన నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ -1 అధికారి విజయలక్ష్మి ఈ ఫిర్యాదు చేశారు. తనను లోబరుచుకుని అసభ్యకరంగా ప్రవర్తించే వారని, తన బలహీనతను ఆసరాగా చేసుకుని తనకు రావాల్సిన ప్రమోషన్లకు అడ్డుపడేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కోరికను తీర్చమంటూ లొంగ తీసుకునేవాడు..ఇతర నర్సులను కూడా కోరికలు తీర్చేందుకు పంపించమనేవాడు..తనపై ఆరోపణలు మోపి తన ఉద్యోగాన్ని సరెండర్ చేయడానికి కూడా కారణమయ్యాడు అని వివరించారు. దీంతో అశోక్‌కుమార్‌ను స్టేషన్‌కు పిలిపించారు. ఏసీపీ మోజెస్ పాల్ ఆయనను విచారించారు. తనకు విజయలక్ష్మికి ఎలాంటి విభేదాలు లేవు. డీఎంఈ ఆమెను సరెండర్ చేస్తే దానికి కారణం తానేననే అపోహతో పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు.