అమరావతి: నియమ నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్‌కు వెళ్లొద్దు.. అడ్డుకు నే వాళ్లు..అడ్డం చెప్పే వాళ్లు వెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అడ్వొకేట్ గూడపాటి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గురువారం తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని, ఎన్నిక ల సంఘం కూడా దీనిపై తగు ఆదేశాలు ఇచ్చి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.