ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు

అమరావతి, మహానాడు: ఎన్నికలకోడ్‌ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని సెక్రటేరియట్‌లో సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. కృష్ణా యూనివర్శి టీలో వైస్‌ చాన్సలర్‌ జ్జానమణి వైసీపీ రంగులు, సీఎం జగన్మోహనరెడ్డి, బొత్సా సత్యనారాయణ ఫొటోలు కలిగి ఉన్న డైరీని అక్కడ ఉద్యోగులకు పంచారని, తిరుపతి వెంకటేశ్వర యూనివ ర్శిటీలో రిజిస్ట్రార్‌ పీఏగా పనిచేస్తున్న మురళీరెడ్డి, డ్రైవర్‌ అయ్యప్ప వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.