వేమూరు, మహానాడు: కొల్లూరు మండలం ఎంపీడీవో ఆఫీస్ లో పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. గర్భిణులకు శ్రీమంతాలు, చిన్న పిల్లలకు అన్నప్రాసన మహోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పిల్లలకి రెండేళ్ళు వచ్చేవరకు పౌష్టికాహారం ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చిన్నపిల్లల తల్లులకు వివరించే బాధ్యత సిబ్బంది మీద ఉందన్నారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు ద్వారా చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం ఇస్తే వారు ఎదుగుదల బాగుంటుంది అనేది ఈ ప్రాజెక్టు తల్లులు తెలుసుకోవాలి. పౌష్టికాహారం సరిగా అందించలేకపోతే అనేక వైకల్యాలతో పిల్లల పుట్టే ఇబ్బంది ఉంది. అంగవైకల్యం బారిన పడకుండా ఈ రాష్ట్రంలో పిల్లల్ని చూడాలన్నారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.