తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేయండి

జగ్గంపేట నియోజకవర్గం, నీటిపారుదల, రోడ్లు, ఏలేరు ఆధునీకరణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ, జగ్గంపేట జులై 2: కాకినాడ కలెక్టరేట్ లో కాకినాడ జిల్లా శాసనసభ్యులు ఉన్నతస్థాయి అధికారులతో జిల్లాలో సమస్యలపై సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియోజవర్గంలో ఇరిగేషన్ సమస్యల పైన, ముఖ్యంగా తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులు పూర్తిస్థాయిలో చేసి మెట్ట ప్రాంత రైతులను ఆదుకోవాలని నియోజవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ పూర్తి చేయించాలని ఎమ్మెల్యే నెహ్రూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు. ఏలేరు ఆధునీకరణ పై ఇరువురు చర్చించుకున్నారు. నియోజవర్గంలో అనేక సమస్యలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ షకీల్ సన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు.